ఎన్‌సీసీ క్యాంప్‌ లో విద్యార్థులకు కరోనా లక్షణాలు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎస్‌కేఆర్‌ ఉన్నత పాఠశాలలోని 40 మంది ఎన్‌సీసీ విద్యార్థులకు కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. దీంతో అధికారులు విద్యార్థులను ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. ఈనెల 18 నుంచి పాఠశాలలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 317 మంది ఎన్‌సీసీ క్యాడెట్లతో క్యాంపు నిర్వహిస్తున్నారు. వీరు స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో పరీక్షించిన వైద్యులు 40 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు నిర్దారించారు. వీరిని వెంటనే ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందజేస్తున్నారు. వీరితో తిరిగిన సహచర విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పడు తెలుసుకుంటున్నారు. అయితే ఎన్‌సీసీ క్యాంప్‌ కొనసాగింపుపై అధికారులు త్వరలో ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)