తప్పుచేసినవారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని నర్సీపట్నంలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఇంటి దగ్గర గోడ కూల్చివేత ఘటనలో హైడ్రామా చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. రాత్రి పూట కూల్చివేతలపై కోర్టు వ్యాఖ్యలకు సీఎం జగన్ ఏం సమాధానం చెపుతారు? అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. తప్పు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అయ్యన్నది కబ్జా కాదు.. ఇడుపులపాయలో వైఎస్ కుటుంబం చేసింది కబ్జా. ఇడుపులపాయలో వైఎస్ కుటుంబం 600 ఎకరాల దళితుల భూములు చెరబట్టడం నిజమైన కబ్జా. నిత్యం టీడీపీ నేతల హౌస్ అరెస్టుల పర్వం జగన్ పిరికితనాన్ని చాటుతున్నాయి. ఛలో నర్సీపట్నం కార్యక్రమానికి వెళ్తున్న నేతలను అరెస్ట్ చేయడం అక్రమం అన్నారు చంద్రబాబు. గట్టిగా గళం వినిపిస్తున్న టీడీపీ బీసీ నేతలపై కేసులు, అరెస్టులు, ఇళ్ళపై దాడులతో జగన్ వేధించే ప్రయత్నం చేస్తున్నారని బాబు మండిపడ్డారు. జగన్ కక్ష సాధింపు కోసం కోర్టు నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రతి అధికారి మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రభుత్వ ప్రాపకం కోసం నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించి అధికారులు చిక్కుల్లో పడొద్దు. అయ్యన్న ఇంటిపై దాడి పతనమైన జగన్ ప్రభుత్వ ఆలోచనలకు పరాకాష్ట అన్నారు. ఛలో నర్సీపట్నం వెళ్లే ప్రయత్నం చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు టీడీపీ నేతల్ని అదుపులోకి తీసుకుంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)