బకెట్ నీటి కోసం ....!

Telugu Lo Computer
0


మహారాష్ట్ర లోని అమరావతి జిల్లాలోని మేల్‌ఘాట్ పర్వత ప్రాంతాల్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. అక్కడ ఉన్న గిరిజన ప్రజలు నీళ్ల కోసం ప్రాణాలకే తెగిస్తున్నారు. ఖాదియాల్ గ్రామంలో ఉన్న రెండు బావిల వద్ద మాత్రమే నీరు దొరుకుతోంది. దీంతో స్థానికులు చెప్పలేని కష్టాలు అనుభవిస్తున్నారు. గ్రామంలో ఉన్న బావిల్లో నీటి తోడేందుకు జనం ఎగబడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా వచ్చిన నీటిని ముందుగా బావిలోకి వదులుతున్నారు. ఆ తర్వాత ఆ నీటిని అక్కడి జనం బకెట్లు, బిందెలతో తోడుకుంటున్నారు. చాలా హృదయవిదారకర రీతిలో మేల్‌ఘాట్ ప్రజలు జీవిస్తున్నారు. బావి నుంచి తోడిన నీళ్లు మురికి మురికిగా ఉంటున్నాయని, అవి తాగడం వల్ల ప్రజలు ఆరోగ్య సమస్యలకు గురవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)