కేన్ విలియమ్సన్‌కు కరోనా - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 9 June 2022

కేన్ విలియమ్సన్‌కు కరోనా


న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కరోనా బారిన పడ్డారు. ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు ముందు నిర్వహించిన కరోనా పరీక్షల్లో అతడికి కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో నాటింగ్‌హమ్ వేదికగా జరగనున్న టెస్ట్ మ్యాచ్‌కు కేన్ దూరం కానున్నాడు. కరోనా బారిన పడటంతో కేన్ ఐదు రోజులపాటు ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. దీంతో అతడికి రీప్లేస్‌మెంట్‌గా హమిష్ రూథర్‌ఫర్డ్‌ను జట్టులోకి తీసుకున్నారు. కేన్‌కు కొవిడ్ సోకడంతో మూడు టెస్టుల సిరీస్‌లో న్యూజిలాండ్ రాణించడం కష్టమేనన్న భావన క్రీడా విశ్లేషకుల్లో వ్యక్తం అవుతోంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్లు లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఓటమిపాలయ్యారు. జో రూట్ నాలుగో ఇన్నింగ్స్‌లో సంచలన శతకం బాదడంతో ఇంగ్లాండ్ 277 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. తొలి టెస్టులో విలియమ్సన్ విఫలమయ్యాడు. 2 ఇన్నింగ్స్‌ల్లో 17 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఎల్బో గాయం తర్వాత విలియమ్సన్ ఆడిన మొదటి టెస్టు ఇదే కావడం గమనార్హం. గాయం కారణంగా కివీస్ ఆల్‌రౌండర్ కాలిన్ డి గ్రాండ్‌హోమ్ సైతం రెండో టెస్టుకు దూరం కాగా.. అతడి స్థానంలో మిచెల్ బ్రేస్‌వెల్‌ను ఎంపిక చేశారు.

No comments:

Post a Comment