బ్రహ్మ శక్తి ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

Telugu Lo Computer
0


ఢిల్లీలోని బ్రహ్మ శక్తి ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) వార్డులో మంటలు చెలరేగడంతో ఓ రోగి మరణించాడని అగ్నిమాపకశాఖ అధికారులు చెప్పారు.బ్రహ్మ శక్తి ఆసుపత్రిలో మంటలను అదుపు చేసేందుకు 9 అగ్నిమాపకశాఖ వాహనాలను ఆస్పత్రికి తరలించినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. వెంటిలేటర్‌పై ఉన్న ఒకరిని మినహాయించి భవనం లోపల ఉన్న రోగులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని గార్గ్ చెప్పారు. ఈ అగ్నిప్రమాదంలో ఓ రోగి మృతి చెందినట్లు భావిస్తున్నామని అతుల్ గార్గ్ తెలిపారు.ఆసుపత్రిలో అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)