పెంపుడు కుక్కపై చిరుత దాడి

Telugu Lo Computer
0


మహారాష్ట్ర నాసిక్‌లోని ఓ గ్రామంలో నివాస ప్రాంతంలోకి ప్రవేశించిన చిరుతపులి పెంపుడు కుక్కపై దాడి చేసింది. వీడియోలో అర్థరాత్రి సమయంలో నల్ల కుక్క తక్కువ ఎత్తులో ఉన్న ఓ గోడపై కూర్చొని ఉంది. కొన్ని సెకన్ల తర్వాత దానికి చిరుతపులి కనిపించింది. దీంతో గోడపై నుంచి దూకి తప్పించుకొనే ప్రయత్నంలో కుక్కను గమనించిన చిరుత ఒక్కసారిగా దాడికి యత్నించింది. చిరుతపులి మొదట్లో కుక్కను చూసి వెనుదిరిగింది. మళ్లీ వెనుక్కు తిరిగొచ్చి కుక్కపై దాడి చేసింది. చిరుతపులి పంజా నుంచి తప్పించుకొనేందుకు ప్రయత్నించినప్పటికీ కుక్కకు అవకాశం లేకుండా పోయింది. చిరుతదాడిలో కుక్క ప్రతిఘటించినప్పటికీ కొద్దిసేపటి తరువాత చిరుతపులి తన దవడల్లో కుక్కను తీసుకొని వెళ్లిపోయింది.  ఈ ఘటనపై నాసిక్ ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ పంకజ్ గార్గ్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో చిరుతపులి సంచారం ఎక్కువైనందున ముంగ్సారే గ్రామ ప్రజలు రాత్రిపూట ఇళ్లలోనే ఉండాలని  విజ్ఞప్తి చేస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేశామని తెలిపారు. పెంపుడు కుక్కపై చిరుతపులి దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను సుమారు 90 వేల మంది వీక్షించి కామెంట్లు చేస్తున్నారు. చిరుతపులి దాడి చేస్తుందని తెలిసినా తమ పెంపుడు కుక్కలను బయట ఎందుకు ఉంచుతున్నారు అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించారు. ఇదిలాఉంటే నాసిక్‌ ప్రాంతంలో నివాస ప్రాంతాలలోకి చిరుతలు ప్రవేశించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)