తెలంగాణా ప్రజలకు మోదీ, రాహుల్‌ శుభాకాంక్షలు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 1 June 2022

తెలంగాణా ప్రజలకు మోదీ, రాహుల్‌ శుభాకాంక్షలు !


తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను  ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ  తెలిపారు. ''రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, నా తెలంగాణా సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు. కష్టపడి పని చేయడంలో, దేశాభివృద్ధికి పాటుపడడంలో పేరు పొందినవారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ప్రపంచ ప్రఖ్యాతి పొందినది తెలంగాణా రాష్ట్ర సంస్కృతి. తెలంగాణా ప్రజల శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను'' అంటూ ట్విట్టర్‌లో  నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.''తమ పోరాట స్ఫూర్తితో యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమైన నా తెలంగాణ సోదర సొదరీమణులందరికీ శుభాకాంక్షలు. ఈ చారిత్రాత్మక రోజున అమరవీరుల, వారి కుటుంబసభ్యుల త్యాగాలను స్మరించుకుందాం''. ''గత 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం టీఆర్‌ఎస్‌ పాలనలో దారుణమైన పాలనను చవిచూసింది. ముఖ్యంగా రైతులు, కార్మికులు, పేదలు మరియు సామాన్య ప్రజలకు శ్రేయస్సును తీసుకురావడంపై దృష్టి సారించిన ఒక మోడల్ రాష్ట్రంగా, ఉజ్వల తెలంగాణ నిర్మాణానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని నేను పునరుద్ఘాటించాలనుకుంటున్నాను'' అంటూ రాహుల్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

No comments:

Post a Comment