టీడీపీకి దివ్యవాణీ రాజీనామా

Telugu Lo Computer
0


టీడీపీకి రాజీనా మా చేస్తున్నట్లు టీడీపీ అధికార ప్రతినిధి, సినీ నటి దివ్యవాణి  తాజాగా ప్రకటించారు.అంతకు ముందు రాజీనామాపై ట్వీట్ చేసిన దివ్యవాణి ఆ తర్వాత ఆ పోస్టును డిలీడ్ చేశారు. ఈ క్రమంలో బుధవారం పార్టీ అధినేత చంద్రబాబుతో ఆమె భేటీ అయ్యారు. దీంతో పరిస్థితి సద్దుమణిగిపోయిందని అంతా భావించిన నేపథ్యంలో గురువారం ఉదయం తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా దివ్యవాణి వీడియోను రిలీజ్ చేశారు. చంద్రబాబు తాను ఏం చర్చించామో రేపు ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించి వివరిస్తానని చెప్పారు. ఇన్నాళ్లు తనను ఆదరించిన టీడీపీ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. రాజీనామా విషయంలో అటుఇటు ఊగిసలాటి చివరకు రాజీనామా చేయడంతో సైకిల్ పార్టీలో ఏం జరుగుతోందనే టెన్షన్ మొదలైంది. పార్టీలోకి దుష్ట శక్తులు ప్రవేశించాయని ఇటీవలే దివ్యవాణి చేసిన ప్రకటన దుమారం రేపిన సంగతి తెలిసిందే. 

Post a Comment

0Comments

Post a Comment (0)