అగ్నివీర్ నోటిఫికేషన్ జారీ

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా అగ్నివీర్ పథకంపై ఆందోళనలు కొనసాగుతూ ఉంటే, మరోవైపు ఇండియన్ ఆర్మీ 'అగ్నివీర్' నోటిఫికేషన్ జారీ చేసింది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ సోమవారం విడుదల చేసింది. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ (ఏవియేషన్/అమ్యూనిషన్ ఎగ్జామినర్), అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ (టెన్త్ పాస్), అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ (8వ తరగతి పాస్) ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్‌లో అగ్నివీర్ పథకానికి, ఉద్యోగాలకు సంబంధించి టర్మ్స్ అండ్ కండీషన్స్, సర్వీస్ నిబంధనలు, అర్హత, ఇతర సమాచారం మొత్తం పొందుపరిచారు. ఆర్మీ యాక్ట్ 1950 సర్వీసు నిబంధనల ప్రకారం నాలుగేళ్ల ఉద్యోగ కాల పరిమితికి అనుకూలంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అగ్నివీర్ పథకం ద్వారా ఎంపికైన అభ్యర్థలు ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి. వాయు, నావిక, భూ సైన్యం ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి. అగ్నివీర్‌లకు ఎలాంటి పెన్షన్ గానీ, గ్రాట్యుటీ గానీ అందదు. ఆర్మీ ర్యాంకులతో పోలిస్తే వీళ్ల ర్యాంకులు భిన్నంగా ఉంటాయి. అగ్నివీర్‌లు సైన్యం కోరిన చోట పనిచేయాలి. ఇందులో చేరేందుకు ఫిజికల్, రిటన్ టెస్ట్, ఫీల్డ్ టెస్ట్, మెడికల్ చెకప్ వంటివి పాసవ్వాలి. రిజిస్ట్రేషన్లు జూలై నుంచి ప్రారంభమవుతాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)