ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు

Telugu Lo Computer
0


ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు ప్రకటించింది. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఒక గిరిజన వ్యక్తికి, అందులోనూ మహిళకు ఇవ్వడం శుభపరిణామమని వైసీపీ పేర్కొంది. అందుకే రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించినట్టు తెలిపింది. గడిచిన మూడేళ్ళుగా సామాజిక న్యాయంలో దేశంలోనే పెద్దపీట వేస్తున్న పార్టీగా ద్రౌపది ముర్ముకి మద్దతు తెలుపుతున్నామన్న వైసీపీ, నామినేషన్‌ కార్యక్రమానికి పార్లమెంటరీ పార్టీ నాయకుడు, లోక్‌సభలో పార్టీ పక్ష నేత హాజరుకానున్నారు. ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉన్నందున సీఎం జగన్‌ హాజరుకావడం లేదు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఇవాళ ద్రౌపది ముర్ము నామినేషన్‌ వేయనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. నామినేషన్‌కు సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి నివాసంలో పేపర్లు సిద్ధమయ్యాయి. నామినేషన్ సందర్భంగా ఎన్డీఏ ముఖ్యమంత్రులు ఢిల్లీకి రావాలని ఆహ్వానం అందింది. ఇక ఇవాళ నామినేషన్ వేసే సమయంలో ద్రౌపది ముర్ము వెంట ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు ఉండేలా ఏర్పాట్లు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)