సైక్లింగ్‌తో లాభాలెన్నో !

Telugu Lo Computer
0


ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబానికి కారైనా, బైక్‌ అయినా సైకిలే. ఈ రోజు ప్రపంచ సైకిల్‌ దినోత్సవం. పర్యావరణానికి పర్యావరణం. ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇస్తున్న ఈ వాహనాన్ని మర్చిపోకూడదు సుమీ. ఇంతకు ఈ సైకిల్‌ దినోత్సం ఎలా వచ్చిందనుకుంటున్నారా.? ఐక్యరాజ్య సమితి 2018లో జూన్‌ 3న ప్రపంచ సైకిల్‌ దినోత్సవంగా ప్రకటించింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్ని అంటుతోన్న ఈ సమయంలో డబ్బు ఆదా చేసే వాహనమేదంటే సైకిలే. చిన్ననాటి ప్రతి ఒక్కరూ సైకిల్‌ తొక్కాలని ఊవిళ్లూరినవారే. ఇక సైకిల్‌ తొక్కడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయో. బరువు తగ్గడంతో పాటు కండరాలు బలోపేతానికి చాలా మంచింది. సైక్లింగ్‌తో బద్ధకం, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. శారీర దృఢత్వం చేకూరుతుంది. ప్రతి రోజూ 30 నిమిషాల పాటు సైకిల్‌ తొక్కడం వల్ల అనారోగ్యం బారిన అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాస్త దూరంలో ఉన్న పనికి, చిన్న వస్తువులకు బైక్‌, కారు వంటి వాహనాలను తీసేయకుండా సైకిల్‌పై వెళ్లి రావడానికి ప్రయత్నించండి. 

Post a Comment

0Comments

Post a Comment (0)