నోటి పూత - నివారణోపాయం !

Telugu Lo Computer
0


నోటిలో అక్కడక్కడా పొక్కులలాగా ఏర్పడి అవి పగిలి ఆ ప్రాంతంలో తెల్లగా మారుతుంది. దీనినే నోటి పూత అంటారు. మనం ఆహారం తీసుకున్నా, నీటిని తాగినా ఇవి మంటను, నొప్పిని కలిగిస్తాయి. ఇవి చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరినీ బాధిస్తాయి. పెద్ద వారి కంటే చిన్న పిల్లల్లో మనం ఈ సమస్యను ఎక్కువగా చూడవచ్చు. ఈ నోటిపూత సమస్య రావడానికి అనేక కారణాలు ఉంటాయి. మనం నోటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోయినా, శరీరంలో వేడి అధికంగా ఉన్నా అవి నోటిపూత సమస్యకు దారి తీస్తాయి. ఈ సమస్య నుండి బయటపడడానికి అనేక రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటాం. వైద్యులు ఈ సమస్య నుండి బయటపడడానికి ఆయింట్ మెంట్లను సూచిస్తారు. కానీ ఈ ఆయింట్ మెంట్లను వాడకపోవడమే మంచిది. వీటిలో ఉండే రసాయనాల కారణంగా మనం ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. నోటి పూతను తగ్గించడంలో మనకు నేల ఉసిరి మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మొక్క మనకు వర్షాకాలంలో ఎక్కడపడితే అక్కడ కనబడుతుంది. ఈ మొక్కను ఉపయోగించి మనం నోటిపూత సమస్య నుండి బయటపడవచ్చు. నోటిపూతతో బాధపడే వారు  నేల ఉసిరి మొక్కను సమూలంగా సేకరించి కచ్చా పచ్చాగా దంచి ఒక గ్లాస్ నీటిలో వేసి ఒక రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం వేప పుల్లతో దంతాలను శుభ్రం చేసుకుని ఆ తరువాత ఈ నీటిని నోట్లో పోసుకుంటూ 15 నిమిషాల పాటు పుక్కిలించి ఉమ్మి వేయాలి. సమస్య మరీ తీవ్రంగా ఉన్న వారు ఇలా చేసిన తరువాత ఒక జామ ఆకులో ఒక చింతపండు రెబ్బను ఉంచి బాగా నమిలి మింగాలి. ఇలా చేయడం వల్ల చాలా త్వరగా నోటి పూత సమస్య తగ్గుతుంది. ఈ విధంగా నేల ఉసిరి మొక్కను ఉపయోగించి మనం నోటిపూత సమస్య నుండి బయటపడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)