తెలంగాణ శాసనసభ రద్దు ?

Telugu Lo Computer
0


తెలంగాణ శాసనసభను రద్దు చేస్తారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. త్వరలోనే శాసనసభ సమావేశాలు నిర్వహించి తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష, రుణాలు తీసుకోవడంలో కేంద్రం నుంచి ఎదురవుతున్న సహాయ నిరాకరణ, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం తదితర అంశాలపై సభలో చర్చ జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడనేది త్వరలోనే తేదీలు ఖరారు చేస్తారని తెలంగాణ రాష్ట్రసమితి వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది చివరిలోనే తెలంగాణ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం 2023 డిసెంబరులో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగాలి. అయితే ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని ప్రశాంత్ కిషోర్ టీమ్ సర్వే నిర్వహించి నివేదిక అందజేసింది. ఈసారి సిట్టింగ్‌ల్లో ఎక్కువమందికి టికెట్లు దక్కవని, వారికి ప్రత్యామ్నాయ పదవులిస్తానని కేసీఆర్ నేరుగా వారికి హామీ ఇవ్వబోతున్నట్లు టీఆర్ఎస్ వర్గాల సమాచారం. ఖమ్మం జిల్లా పర్యటనలో ఎన్నికలకు సిద్ధమవ్వాలంటూ  కేటీఆర్  నేతలకు పిలుపునివ్వడం ఈ ఊహాగానాలకు మరింత బలచేకూరుస్తోంది. కేసీఆర్ రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం ఈనెల 18 లేదా 19 తేదీల్లో జాతీయ పార్టీని ప్రకటిస్తారు. రాబోయే ఎన్నికల్లో గెలుపొందడానికి అభ్యర్థుల మార్పుతోపాటు ప్రచార వ్యూహాన్ని కూడా ఖరారు చేయనున్నారు. శాసనసభను వీలైనంత తొందరగా రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)