షో నుంచి కోపంగా వెళ్లిపోయిన మెగాస్టార్ ?

Telugu Lo Computer
0


ప్రముఖ ఓటిటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ రియాలిటీ షో తుది అంకానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ ఫినాలే నిర్వహించేలా ప్లాన్ చేశారు నిర్వాహకులు. దేశవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన ఈ షో తెలుగులో మొదటిసారిగా అది కూడా ఆహా ఓటీటీ వేదికగా ఇండియన్ ఐడల్ తెలుగు అంటూ ప్రసారం అవుతోంది. ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఈ ఇండియన్ ఐడల్ తెలుగు ఫైనల్ కార్యక్రమానికి మెగా టచ్ ఇవ్వబోతున్నారు. ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్-1 ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్టుగా కొన్నాళ్ల నుండి వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు దీనిపై క్లారిటీ వచ్చింది. తాజాగా షో జడ్జిలతో చిరంజీవి దిగిన ఫొటో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తుంది. అయితే ఈ గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌కు సంబంధించిన మరో కాంట్రవర్షియల్ వార్త కూడా నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో నిజమెంతుందో, అబద్దమెంతో కానీ.. ఆహా గ్రాండ్ ఫినాలే ఫైనల్ కోసం వచ్చిన చిరంజీవి అసహనం వ్యక్తం చేశాడట. హోస్ట్ ఏదో తప్పుగా చెప్పి.. మళ్లీ రీటేక్ తీసుకోవడంపై చిరంజీవి అసహనం వ్యక్తం చేశాడని, దాంతో సెట్ నుంచి త్వరగా వెళ్లిపోయాడని టాక్. ఈవెంట్ అంతా అయిపోయిన తరువాత ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. మొత్తానికి ఈవెంట్ అంతా అయిపోయిన తరువాత చిరంజీవి అలక పూని వెళ్ళిపోవటం మాత్రం ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)