మోదీకి జో బైడెన్ ఆత్మీయ పలకరింపు !

Telugu Lo Computer
0


జర్మనీలోని మ్యునిచ్‌లో జరుగుతున్న జీ-7 సదస్సుకు అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీతోపాటు పలు దేశాధినేతలు సదస్సుకు హాజరుకాగా, వారితో మోదీ పలు అంశాలపై చర్చలు జరిపారు. సదస్సులో మోదీ దగ్గరకు వచ్చి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధానిని ఆత్మీయంగా పలకరించారు. సదస్సు ప్రారంభానికి కొద్దిసేపటి ముందు మోదీని, బైడెన్ కలిసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆ సమయంలో దేశాధినేతలంతా పలకరించుకుంటూ ఫొటోలు దిగుతున్నారు. కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడోతో మోదీ మాట్లాడుతూ, చేయి పట్టుకుని మెట్ల మీది నుంచి దిగుతున్నారు. అప్పుడే వెనుక నుంచి వచ్చిన బైడెన్, మోదీ దగ్గరకు చేరుకుని, ఆయన భుజం తట్టి మరీ పలకరించారు. వెంటనే వెనక్కు తిరిగిన మోదీ, బైడెన్ చూసి కరచాలనం చేసి, నవ్వుతూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Post a Comment

0Comments

Post a Comment (0)