బురద నీరు వడకట్టి తాగుతున్నారు

Telugu Lo Computer
0


మహారాష్ట్ర లోని నాసిక్ గ్రామంలో తీవ్రమైన నోటి సంక్షోభం నెలకొంది. మహిళలు నీళ్లు తెచ్చుకోవడానికి కిలో మీటర్ల మేర నడుచుకుంటూ వెళుతున్నారు. అవి స్వచ్ఛమైన నీళ్లా అంటే కావు. బురద నీటిని బట్టలో వడపోసి తీసుకొని వెళుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. లోతైన బావిలో ఓ వ్యక్తి దిగగా.. పైన ఉన్న వాళ్లు తాళ్ల సహయంతో కిందకు బిందెలు, చిన్నపాటి ప్లాస్టిక్ డ్రమ్ములను వదులుతుండడం కనిపిస్తోంది. పైకి లాగిన తర్వాత.. బుదర నీటిని వేరే దానిలో పోసుకుంటున్నారు. నెత్తిపై బిందెలను పెట్టుకుని.. సుమారు మూడు కిలో మీటర్ల దూరం నడుచుకుంటూ వెళుతున్నారు. నెటిజన్లు స్పందిస్తున్నారు. దేశంలో ఇలాంటి పరిస్థితి నెలకొనడం దారుణమని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)