ప్రభుత్వ యోజనా పథకం పేరుతో ఫేక్ మెసేజ్ !

Telugu Lo Computer
0

 

ఓ మెసేజ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో 'ప్రభుత్వ యోజనా' పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఒక్కరి బ్యాంకు ఖాతాల్లో రూ.2,67,000 డిపాజిట్ చేస్తున్నట్లుగా పేర్కొనబడింది. దీనికి సంబంధించి కొంత మంది సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు కూడా వస్తున్నాయి. మీ ఖాతాలో ప్రభుత్వ యోజనా పథకం కింద రూ.2.67 లక్షలు జమయ్యాయని ఆ మెసేజ్‌లలో పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ మెసేజ్‌ పూర్తిగా ఫేక్ అని ప్రభుత్వ సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో  స్పష్టం చేసింది. అలాంటి పథకాలేవీ కేంద్ర ప్రభుత్వం అమలుచేయట్లేదని, ఆ మెసేజ్‌లకు కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదని తెలిపింది. అలాంటి ఫేక్ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. అందులో ఒక లింక్ కూడా ఇస్తున్నారు. పొరపాటున కూడా ఈ లింక్‌పై క్లిక్ చేయవద్దు. ఒకవేళ క్లిక్ చేస్తే మీరు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి మెసేజ్‌లను విస్మరించండి.


Post a Comment

0Comments

Post a Comment (0)