కొట్టుకుపోయిన చెక్క వంతెన

Telugu Lo Computer
0


మేఘాలయలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలతో కొండ ప్రాంతాల నుంచి వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలోనే ఓ చెక్క వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోయింది. ఈ చెక్క వంతెన మేఘాలయలోని సౌత్ గారో హిల్స్, వెస్ట్ గారో హిల్స్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన జిజికాను మెగువాకు రాకపోకలు జరిగేందుకు ఈ చెక్క వంతెనను నిర్మించారు. వరదలతో ప్రస్తుతం చెక్క వంతెన కొట్టుకుపోవడంతో రెండు ప్రాంతాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)