డ్రగ్స్‌ తో పట్టుపడ్డ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని  రాజమహేంద్రవరంలోని మోరంపూడి సాయినగర్‌కు చెందిన తీగల దీపక్‌ ఫణీంద్ర, కాకినాడ జిల్లా పెద్దపూడి మండం గొల్లల మామిడాడకు చెందిన వట్టూరి సూర్యసంపత్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు. కోవిడ్ నేపథ్యంలో వీరు గత కొంతకాలంగా రాజమహేంద్రవరం నుంచి వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. వీరు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు. ఈ నెల 25న గోవాలోని ఓ డ్రగ్ పెడ్లర్ వద్ద ఎండీఎంఏ డ్రగ్స్‌(25 ట్యాబ్లెట్స్), ఎల్‌ఎస్‌డీ(2 స్ట్రిప్స్‌) కొన్నారు. అనంతరం అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆపై లోకల్ పోలీసుల నుంచి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీరు పెద్ద అంబర్‌పేట్‌ ఔటర్‌ రింగు రోడ్డు వద్ద లారీ ఎక్కి రాజమహేంద్రవరానికి బయలుదేరారు. పక్కా సమాచారం తో పోలీసులు మాటు వేసి వీరిని పట్టుకున్నారు. నిందితులు డ్రగ్స్‌ తీసుకోవడంతో పాటు ఇతరులకు అమ్ముతారని పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి చౌటుప్పల్‌ కోర్టు న్యాయమూర్తి ఎదుట నిందితులను హాజరుపరిచి నల్గొండ జైలుకు తరలించినట్లు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)