భద్రతపై పంజాబ్ ప్రభుత్వం యూటర్న్?

Telugu Lo Computer
0


కాంగ్రెస్ నేత, పంజాబ్ సింగర్ సిద్ధూ మూసే వాలా హత్యతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కొన్ని రోజుల క్రితం తొలగించిన వీఐపీల భద్రతను తిరిగి కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం నుంచి 424 మంది వీవీఐపీలకు తిరిగి భద్రతను కల్పించనున్నట్లు పేర్కొంది. గురువారం భద్రత తొలగింపుపై దాఖలైన పిటిషన్‌ను హర్యానా, పంజాబ్ కోర్టు విచారించింది. భద్రతను తొలగించిన వారిలో ఒకరైన మాజీ మంత్రి ఒపీ సోని హైకోర్టులో పిటిషన్‌కు ఆప్ ప్రభుత్వం బదులిచ్చింది. భద్రతను ఎందుకు తగ్గించారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జూన్ 1984లో స్వర్ణ దేవాలయంలో చొరబడిన ఉగ్రవాదులను అంతం చేయడానికి సైనిక దాడిని ప్రస్తావిస్తూ జూన్ 6న జరిగే ఆపరేషన్ బ్లూస్టార్ వార్షికోత్సవానికి భద్రతా సిబ్బంది అవసరమని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో భద్రతా తొలగింపు వివాదస్పదం కావడంతో పంజాబ్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. సిద్ధూ హత్య తర్వాత పంజాబ్ ప్రభుత్వ చర్యలపై విపక్షాలు నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెలువెత్తిన సంగతి తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)