మా అందరినీ అరెస్టు చేయండి

Telugu Lo Computer
0


ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను కూడా కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేయించే అవకాశం ఉందని ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌ను నగదు అక్రమ చలామణీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తర్వాత.. ఇప్పుడు మనీశ్ సిసోడియాను అవినీతి కేసులో అరెస్టు చేయించాలని కేంద్ర సర్కారు ప్రణాళిక వేసుకుందని, ప్రస్తుతం ఈ విషయంపైనే దృష్టి పెట్టినట్లు తనకు తెలిసిందని కేజ్రీవాల్ అన్నారు.”మా అందరినీ అరెస్టు చేయించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరుతున్నాను. విద్యా రంగంలో మనీశ్ సిసోడియా చేసిన కృషి వల్ల 18 లక్షల మంది చిన్నారులు లబ్ధి పొందుతున్నారు. నేను ఆ 18 మంది చిన్నారులను ఓ విషయం అడగాలనుకుంటున్నాను. మనీశ్ సిసోడియా అవినీతికి పాల్పడ్డారా.. మీరే చెప్పండి? ఆయన ప్రపంచంలో భారత్ కీర్తి పతాకాన్ని ఎగరేశారు. అటువంటి వ్యక్తిని అరెస్టు చేయాలా? లేదా ఆయనకు అవార్డు ఇవ్వాలా?” అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ కస్టడీలో ఉన్న సత్యేందర్ జైన్ గురించి కూడా కేజ్రీవాల్ స్పందిస్తూ.. ”మొహల్లా క్లినిక్‌లను ప్రారంభించడంలో, ప్రజల కోసం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రూపొందించడంలో సత్యేందర్ జైన్ చాలా కృషి చేశారు. నేను విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఓ విషయం అడగాలనుకుంటున్నాను. మనీశ్ జీ, సత్యేందర్ జీ అవినీతిపరులా?” అని కేజ్రీవాల్ అడిగారు.

Post a Comment

0Comments

Post a Comment (0)