పాకిస్థాన్‌లో హిందూ ఆలయంపై దాడి

Telugu Lo Computer
0


పాకిస్థాన్‌లోని కరాచీ, కోరంగి ప్రాంతంలోని శ్రీమరీ మాతా మందిరంలో దేవతామూర్తుల ప్రతిమలను దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మందిరం వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. హిందూ ఆలయంపై దుండగులు దాడి చేయడంతో కరాచీలోని హిందూ మతానికి చెందిన ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వార్తా సంస్థ తెలిపింది. ఎనిమిది మంది దుండగులు మోటారు సైకిళ్లపై వచ్చి ఆలయంపై దాడికి పాల్పడ్డారని స్థానిక వ్యక్తి సంజీవ్ చెప్పారు. ఈ ఘటనకు వాళ్లు ఎందుకు పాల్పడ్డారో తెలియడం లేదని అన్నారు. ఈ దాడికి పాల్పడిన తర్వాత దుండగులు అక్కడి నుంచి వెంటనే పారిపోయారని పోలీసులు మీడియాకు వివరించారు. గత ఏడాది కూడా పాక్‌లోని అనేక ప్రాంతాల్లో హిందూ ఆలయాలపై దాడులు జరిగాయి. అధికారుల గణాంకాల ప్రకారం.. పాకిస్థాన్‌లో దాదాపు 75 లక్షల మంది హిందువులు ఉంటారు. సింధు రాష్ట్రంలో హిందువులు అధికంగా నివసిస్తున్నారు. తీవ్రవాదుల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయని అక్కడి హిందువులు అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)