రాంచీలో హింసాత్మక నిరసనలు

Telugu Lo Computer
0


మహ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ అనుచిత వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. జార్ఖండ్ రాజధాని రాంచీలో హింసాత్మక నిరసనలు జరిగిన అనంతరం శుక్రవారం అర్ధరాత్రి ఆలయంపై కొందరు దుండగులు పెట్రోల్ బాంబులు విసిరారు. సూర్య మందిర్ ఆలయం లోపలికి నాలుగు పెట్రోల్ బాంబులు విసిరిన సమయంలో ఆలయ ప్రాంగణంలో పూజారి తన కుటుంబ సభ్యులతో పాటు నిద్రిస్తున్నారు. ఆలయంలో పెట్రోల్ బాంబులు విసరడంతో పూజారి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. రాత్రి నుంచి తమకు నిద్ర కరవైందని చెప్పారు. దోషులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. మరోవైపు నూపుర్ శర్మ వ్యాఖ్యలపై రాంచీ నగరంలో ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నూపుర్ శర్మపై కఠిన చర్యలు చేపట్టాలని ప్లకార్డులను ప్రదర్శంచారు. పరిస్ధితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేయడంతో నిరసనకారులు పోలీసులప రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. అల్లరి మూకను చెదరగొట్టేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఘర్షణలో గాయపడిన వారిని రిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. క్షతగాత్రుల్లో ఇద్దరు మరణించారని ఆస్పత్రి వర్గాలు శనివారం వెల్లడించాయి. హింసాత్మక ఘటనలతో రాంచీలో నిషేధాజ్ఞలు జారీ చేసిన పోలీసులు ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)