ఉద్ధవ్ ఠాక్రేకు కరోనా

Telugu Lo Computer
0


మహారాష్ట సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు సీనియర్ కాంగ్రెస్ లీడర్ కమల్ నాథ్ వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభం గురించి అతనితో చర్చించడానికి కరోనా కారణంగా కుదరడం లేదని అన్నారు. “ఉద్దవ్ ఠాక్రేతో మీటింగ్ జరగాల్సి ఉంది. కానీ, అతనికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది” అని కమల్ నాథ్ పేర్కొన్నారు. ఈ కారణంతోనే శివసేన లీడర్ క్యాబినెట్ తో వీడియో కాల్ ద్వారా సమావేశమయ్యారు. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. మహా వికాస్ అంఘాడి (ఎంబీఎం) కూటమి ప్రభుత్వం పెద్ద రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. శిసేన నేత, ప్రభుత్వంలో కొనసాగుతున్న మంత్రి ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి ఉధ్ధవ్ ఠాక్రేకు షాకిచ్చాడు.శివసేన ఎమ్మెల్యేలతో పాటు, పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మొత్తం 46 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేశాడు. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమితో తెగతెంపులు చేసుకొని బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉద్ధవ్ ఠాక్రేకు రెబల్ ఎమ్మెల్యేలు అల్టిమేటం జారీ చేసినట్లు తెలిసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)