ఆరు జూనియర్‌ కళాశాలల అఫిలియేషన్‌ రద్దు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆరు జూనియర్‌ కళాశాలల అఫిలియేషన్‌ రద్దు చేసినట్లు ఆర్‌ఐవో శంకర్‌ నాయక్‌ మంగళవారం తెలిపారు. 2022-23 విద్యాసంవత్సరానికిగాను ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి ఆదేశాల మేరకు కర్నూలు భాగ్య నగరంలోని సెఫాస్‌ జూనియర్‌ కళాశాల, నంద్యాల భువన విజయ జూనియర్‌ కళాశాల, నంద్యాలలోని నలంద జూనియర్‌ కళాశాల, నంద్యాల విజయవాడ జూనియర్‌ కళాశాల, నంద్యాల డా.రామలింగారెడ్డి బాలికల జూనియర్‌ కళాశాల అఫిలియేషన్‌ను రద్దు చేశారు. ఈ కళాశాలల అడ్మిషన్ల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోరాదని తెలిపారు. ఈ కళాశాలల్లో ఇంటర్‌ రెండో సంవత్సరం చదివే విద్యార్థులు టీసీలు తీసుకుని వేరే కళాశాలల్లో అడ్మిషన్‌ పొందాలని ఆయన విద్యార్థులకు సూచించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)