విశ్వరూప్ తనయుడి ఆడియో క్లిప్ వైరల్.! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 2 June 2022

విశ్వరూప్ తనయుడి ఆడియో క్లిప్ వైరల్.!


కోనసీమ అల్లర్ల వ్యవహారంపై, మంత్రి విశ్వరూప్ అనుచరుడైన వైసీపీ నేత అడపా సత్తిబాబుకి విశ్వరూప్ తనయుడు ఫోన్ కాల్ చేసి మాట్లాడిన వ్యవహారం ఓ ఆడియో క్లిప్ మీడియాకి లీక్ అయ్యింది విశ్వరూప్ తనయుడి వాయిస్ విషయానికొస్తే, నానా రకాల దుర్భాషలూ వినిపిస్తున్నాయి అందులో. 'ఎవడికైనా దమ్ముంటే నా ఇంట్లో నేనుంటా.. అప్పుడు రండిరా తగలబెట్టడానికి' అంటూ హెచ్చరిస్తున్నారు  'నాకు కులం లేదు.. మతం లేదు.. జిల్లా పేరు మార్చితే నాలుగు రూపాయలు నష్టమా.? నాలుగు రూపాయలు లాభమా.?' అంటూ మండిపడుతున్నాడాయన. 'నీ కాలుకి దెబ్బ తగిలినట్టుంది కదా.? రెండు కాళ్ళూ తీసేస్తాను..' అంటూ రాయడానికి వీల్లేని రీతిలో అవతలి వ్యక్తికి (అడపా సత్తిబాబు) వార్నింగ్ ఇచ్చేయడం గమనార్హం. 'ఇల్లు తగలబెట్టినోళ్ళకి కులం లేదు, మతం లేదు.. తల్లిని, చెల్లిని, పెళ్ళాన్ని అమ్మకానికి పెట్టే వెధవలే అలాంటి పనులు చేస్తారు.. నీకు మా నాన్న (విశ్వరూప్) పాలు పోసి పెంచారు.. కానీ, నువ్వొక విష సర్పం అని ఆయన గుర్తించలేకపోయారు..' అంటూ విశ్వరూప్ తనయుడు వ్యాఖ్యానించేశాడు. ఈ ఆడియో క్లిప్ నిజమైనదేనా.? కాదా.? అన్నది తేలాల్సి వుంది. గతంలో టీడీపీ కార్యాలయంపైకి వైసీపీ కార్యకర్తలు దాడికి వెళ్ళి, విధ్వంసానికి పాల్పడితే, 'మా కార్యకర్తలకు, అభిమానులకి బీపీ వచ్చింది..' అంటూ అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెలవిచ్చారు. మరి, కోనసీమ జిల్లా పేరు మార్పు విషయమై జిల్లా ప్రజలకెందుకు బీపీ రాకూడదు.? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నాస్త్రాలు దూసుకొస్తున్నాయి. 

No comments:

Post a Comment