నాలుగు రాష్ట్రాల్లోని 16 రాజ్యసభ సీట్లకు కొనసాగుతున్న ఓటింగ్

Telugu Lo Computer
0

 


నాలుగు రాష్ట్రాల్లోని 16 రాజ్యసభ సీట్లకు ఓటింగ్ కొనసాగుతోంది. ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక పరిశీలకులను నియమించి, పోలింగ్‌ ప్రక్రియను వీడియో రికార్డు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న ప్రముఖుల్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్‌ గోయెల్, కాంగ్రెస్‌ నేతలు రణ్‌దీప్‌ సూర్జేవాలా, జైరాం రమేశ్, ముకుల్‌ వాస్నిక్, శివసేన కీలక నేత సంజయ్‌ రౌత్‌ వంటి వారు ఉన్నారు. ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని వీరంతా భావిస్తున్నారు. మొత్తం 57 రాజ్యసభ స్థానాలకు గాను ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బిహార్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్, పంజాబ్, తెలంగాణ, జార్ఖండ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల నుంచి 41 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గత వారం ఈసీ ప్రకటించింది. నాలుగు రాష్ట్రాల్లోని మిగతా 16 సీట్లకు గాను పోటీ తీవ్రంగా ఉంది. ఓపెన్ బ్యాలెట్ విధానంలో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో నోటా ఆప్షన్ ఉండదు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న మహారాష్ట్ర, రాజస్థాన్‌లో 4 స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. మహారాష్ట్రలో అత్యధికంగా 6 సీట్లకు, కర్ణాటకలో 5, రాజస్థాన్‌లో 5, ఇక హర్యానాలో 2 సీట్లకు ఓటింగ్ జరుగుతోంది. జూలైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించున్నాయి. ఇప్పుడు గెలుపొందిన వారు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తారు.

Post a Comment

0Comments

Post a Comment (0)