27 ఏళ్ల తరువాత చిరపుంజిలో భారీ వర్షపాతం

Telugu Lo Computer
0


మేఘాలయలోని చిరపుంజిలో గత 24 గంటల్లో భారీ వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో 81.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1995 తర్వాత జూన్ లో అత్యధికంగా వర్షం కురిసిందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత తేమ ఉండే ప్రదేశాల్లో చిరపుంజి ఒకటి. చిరపుంజిలో జూన్ నెలలో పది సందర్భాల్లో 75 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షం కురిసిందని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్లే వర్షం పడిందని తెలిపింది. మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర నుంచి బుధవారం ఉదయం ఎనిమిదిన్నర వరకు మాసిర్రమ్ లో 71 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మేఘాలయలో ఇప్పటివరకు ఇదే అత్యధిక వర్షపాతం అని వాతావరణ శాఖ పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)