దేశంలో కొత్తగా 11,793 కరోనా కేసులు నమోదు !

Telugu Lo Computer
0


కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన వివరాల ప్రకారం దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,793 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,34,18,839కి చేరుకుంది. చికిత్స పొందుతూ సోమవారం ఒక్కరోజే 27 మంది మరణించారు. ఇప్పటి వరకు దేశంలో కొవిడ్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 5,25,047కు చేరుకుంది. నిన్నటి కంటే ఈరోజు విడుదలైన గణాంకాల ప్రకారం.. కొత్తగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది.  గడిచిన 24గంటల్లో దేశంలో మొత్తం 9,486 మంది వివిధ ఆస్పత్రుల్లో కొవిడ్ బారినుండి చికిత్స పొందుతూ కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. రికవరీ రేటు దాదాపు 98.57 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 96,700కు చేరుకున్నాయి. దీంతో యాక్టివ్ కేసులు 0.21 శాతం ఉన్నాయి. ఇదిలాఉంటే ఇప్పటివరకు 86.14 కోట్లు మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. గడిచిన 24 గంటల్లో 4,73,717 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు 97.31 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను వైద్య సిబ్బంది అందించారు. రాష్ట్రాల వారిగా చూసుకుంటే.. కేరళ రాష్ట్రంలో అత్యధికంగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేరళ రాష్ట్రంలో 3,206 కొత్త కొవిడ్ నిర్ధారణ కేసులు నమోదు కాగా, 13 మంది మరణించారు. మహారాష్ట్రలో 2,369 కొత్తగా కోవిడ్-19 కేసులు నమోదు కాగా, ఐదుగురు మరణించారు. తమిళనాడులోనూ కొవిడ్ కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24గంటల్లో కొత్తగా 1,461 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. ఒక ఢిల్లీలో ఢిల్లీలో 628మందికి కొత్తగా కొవిడ్ నిర్ధారణ కాగా, కొవిడ్ తో చికిత్సపొందుతూ ముగ్గురు మరణించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)