20 మంది ఎమ్మెల్యేలు తిరిగొస్తారు

Telugu Lo Computer
0


మహారాష్ట్రలో నెలకొన్న తాజా సంక్షోభంపై ఆదిత్య ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ ''ముఖ్యమంత్రి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు శివసేన ఎమ్మెల్యేలు తమను తాము లక్షలు, కోట్ల రూపాయలకు అమ్ముకున్నారు. మేం వాళ్లను ఎంతో నమ్మాం. వాళ్లలో ఇంకా మానవత్వం మిగిలి ఉందా? ఏదేమైనా శివసేన ఆధ్వర్యంలోని మహా వికాస్ అఘాడి (ఎమ్‌వీఏ) ప్రభుత్వం మాత్రం కొనసాగుతుంది. మేం కేంద్రంలోనూ అధికారంలోకి వస్తాం. గువహటిలో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో రెండు గ్రూపులున్నాయి. ఒక గ్రూపులో ఉన్న 15-20 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. వాళ్లంతా గువహటి నుంచి ముంబై రావాలనుకుంటున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. మరో గ్రూపు ఎమ్మెల్యేలు దూరంగా పారిపోతున్నారు. వాళ్లకు ధైర్యం, నీతి వంటివి లేవు. తిరిగొచ్చే ఎమ్మెల్యేల కోసం మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఒకవేళ తిరుగుబాటు చేయాలనుకుంటే రాజీనామా చేసి, మా ముందు నిలబడమనండి. చాలా మంది మాకు ఎన్సీపీ, కాంగ్రెస్ ద్రోహం చేశాయంటున్నారు. కానీ, నిజంగా ద్రోహం చేసింది మా వాళ్లే. చాలా మంది ఎమ్మెల్యేలు రిక్షా డ్రైవర్లు, వాచ్‌మెన్లు, పాన్ షాప్ నడిపే వాళ్లు. ఈ రోజు వాళ్లను మంత్రుల్ని చేశాం. ఈ నెల 20న షిండేకు ముఖ్యమంత్రి పదవి కూడా ఆఫర్ చేశాం. కానీ, తను చాలా నాటకాలు వేశాడు'' అని ఆదిత్య ఠాక్రే వ్యాఖ్యానించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)