దావూద్ ఇబ్రహీం అనుచరులపై ఎన్ఐఏ దాడులు

Telugu Lo Computer
0


ముంబైలోని దావూద్ ఇబ్రహీం అనుచరుల ఇళ్లల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం ముంబైలోని 20 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నాగ్‌పాడ, గోరేగావ్, బోరివలి, శాంతాక్రూజ్, ముంబ్రా, భేండీ బజార్ లోని దావూద్ అనుచరుల ఇళ్లల్లో సహా హవాలా ద్వారా డబ్బు తరలించే ముఠానాయకుల ఇళ్లపైనా దాడులు చేపట్టారు. పాకిస్తాన్ లోని కరాచీలో ఉంటూ భారత్ లో మాఫియా కార్యాకలాపాలకు దావూద్ ఇబ్రహీం పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ముంబైలోని కిరాయి హంతకులు, హవాలా ఆపరేటర్లు, డ్రగ్ పెడ్లర్లు, రియల్ ఎస్టేట్ ఆపరేటర్లతో దావూద్ కు సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. విదేశాల్లో ఉంటూ భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలు, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడి అశాంతి రేకెత్తించేలా డీ.కంపెనీ ప్రయత్నిస్తుందన్న నిఘావర్గాల సమాచారంతో..ఈ ఏడాది ఫిబ్రవరిలో దావూద్ పై కేసులు నమోదు చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈక్రమంలో సోమవారం నుంచి ఆయా ప్రాంతాల్లో దాడులు ప్రారంభమైనట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)