దేశంలో భారీ పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర !

Telugu Lo Computer
0


దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు పన్నాగం పన్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను తెలంగాణకు తరలించేందుకు ప్రయత్నించారు. నిఘా వర్గాల పక్కా సమాచారంతో నలుగురి ఖలీస్థానీ ఉగ్రవాదులను భద్రతా దళాలు అరెస్టు చేశాయి. పట్టుబడిన ఉగ్రవాదులకు పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో తెలంగాణ, పంజాబ్, హరియాణా పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. హరియాణాలోని కర్నాల్ ప్రాంతంలోని టోల్ ప్లాజా దగ్గర ఓ అనుమానిత ఇనోవా వాహనాన్ని ఆపి తనిఖీలు చేశారు. అందులో భారీగా ఆయుధాలు ఉన్నట్లు గుర్తించారు. 30 కాలిబర్ తుపాకీలు, ఐఈడీలు, ఆర్డీఎక్స్ కూడా లభ్యమైంది. ఆ వాహనంలో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నంచడంతో వారు పంజాబ్ కు చెందిన ఖలిస్థానీ ఉగ్రవాదులుగా గుర్తించారు. పట్టుబడిన ఆయుధాలను తెలంగాణతో పాటు మహరాష్ట్రకు తరలించాలని ఉగ్రవాదులు భావించినట్లు తేలింది. భారీ ఆయుధాలు ఖలిస్థానీ ఉగ్రవాదులకు ఎలా వచ్చాయన్నది భద్రతా బలగాలు ఆరా తీశారు. ఈ ఆయుధాలను డ్రోన్ల ద్వారా పాక్ సరిహద్దుల నుంచి తీసుకొచ్చినట్లు తేలింది. పాకిస్థాన్‌కు చెందిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్జిందర్ సింగ్ రిండా వీటిని పంపినట్లు గుర్తించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)