ఒడిశాలో టమాటా ఫ్లూ కలకలం

Telugu Lo Computer
0


ఒడిశాలో టమాటా  ఫ్ల్యూ కలకలం రేపింది. హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్‌గా పిలిచే ఈ వ్యాధి..26 మంది చిన్నారులకు సోకింది. అయితే ప్రస్తుతం వారికి ఎలాంటి అపాయం లేదని వైద్యులు పేర్కొన్నారు. టమాటా ఫ్లూగా పేరు పొందిన వైరస్‌…పేగు సంబంధిత వ్యాధి కారణంగా సోకే అంటువ్యాధి. ముఖ్యంగా చిన్నారులకు ఇది వ్యాపిస్తుంది. వయోజనులకు దీన్ని తట్టుకునే రోగనిరోధక శక్తి ఉండటం వల్ల వారిపై ఈ వ్యాధి ప్రభావం చూపదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ వ్యాధి సోకిన చిన్నారులకు జ్వరం, నోట్లో పుండ్లు, చేతులు, కాళ్లు, పిరుదులపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. మొత్తం 36 మంది చిన్నారుల నమూనాలను పరీక్షించగా 26 మందికి ఈ వ్యాధి సోకినట్లు తేలిందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)