గుజరాత్ లో ఒమిక్రాన్ బీఏ.5 రెండో కేసు

Telugu Lo Computer
0


దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల గుజరాత్ వచ్చిన ఓ 29 ఏళ్ల యువకుడిలో బీఏ.5 వేరియంట్‌ నిర్ధారణ అయినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అధిక సాంక్రమిక సామర్థ్యం ఉన్నట్లు భావిస్తోన్నఒమిక్రాన్‌ బీఏ.4, బీఏ.5 రకాల కేసులను ఇప్పటికే తమిళనాడు, తెలంగాణలో గుర్తించగా తాజాగా బీఏ.5 రెండో కేసు గుజరాత్‌లో వెలుగు చూసింది. దక్షిణాఫ్రికాలో నివాసముంటున్న యువకుడు ఇటీవల వడోదరలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. ఈనెల 1న అతడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించగా.. ఒమిక్రాన్‌ బీఏ.5 పాజిటివ్‌గా తేలింది. దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో వ్యాప్తి చెందిన ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్లు బీఏ.4, బీఏ.5లు భారత్‌లో గుర్తించినట్లు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం స్పష్టం చేసింది. తెలంగాణ, తమిళనాడులో ఈ కేసులు బయటపడినట్లు తెలిపింది. ఈ నెల 9న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో తొలి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.4ను గుర్తించారు. ఇండియన్ సార్స్ కోవ్-2 కన్షార్షియం ఆన్ జీనోమిక్స్ ఈ విషయాన్ని వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)