కూతురుపై తండ్రి అత్యాచారం

Telugu Lo Computer
0


బీహార్‌లోని  సమస్తిపూర్‌లోని రోసెరా ప్రాంతంలో చెందిన నిందితుడు వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు.  తన 18 ఏళ్ల కూతురిని కొన్ని రోజులుగా లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఆమె తల్లికి కూడా తెలుసు. అయితే విషయం ఎవరికీ చెప్పొద్దని మామ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో తండ్రి బండరాన్ని ఎలాగైనా బయటపెట్టాలని భావించిన ఆ యువతి సీక్రెట్‌ కెమెరా ద్వారా వీడియో తీసింది. దానిని సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. తన తండ్రి నుంచి ప్రాణ భయం ఉందని, రక్షణ కావాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై రోసారా డీఎస్పీ సహియార్‌ అక్తర్‌ మాట్లాడుతూ.. కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకన్నట్లు తెలిపారు. నిందితుడైన తండ్రిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కేసుపై దర్యాప్తు చేస్తున్నామని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)