దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

Telugu Lo Computer
0


దేశంలో గడిచిన 24 గంటల్లో 2828 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 17,087 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్రం తెలిపింది. యాక్టివ్ కేసుల శాతం 0.04గా ఉంది. కాగా, కరోనాతో గత 24 గంటల్లో మరణించిన వాళ్లు 14 మంది. ఇప్పటివరకు మొత్తం దేశవ్యాప్తంగా 4,31,53,043 కరోనా కేసులు నమోదా కాగా, 5,24,586 మంది మరణించారు. రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 2035 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,26,11,370. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా వైరస్‌కు సంబంధించి రెండు కొత్త సబ్ వేరియెంట్లను గుర్తించారు. బి.ఏ.4, బి.ఏ,5 ఒమిక్రాన్ సబ్ వేరియంట్లను మొదటిసారిగా గుర్తించారు. అయితే, రోగులకు ప్రమాదకర వ్యాధి లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు. ఈ వేరియెంట్లు గతంలో దక్షిణాఫ్రికాలోనే ఎక్కువగా కనిపించాయి. పశ్చిమ బెంగాల్‌లో 38 కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కేసులు పెరిగిపోతుండటంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా నియంత్రించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.


Post a Comment

0Comments

Post a Comment (0)