పాలిస్తున్నఆవు దూడ

Telugu Lo Computer
0


కేరళలోని కన్నూర్‌ జిల్లా కంగోల్‌కు చెందిన సజేశ్‌ 2021 జులైలో ఆవు, దూడను కొనుగోలు చేశాడు. ఆవు పొదుగుకు ఇన్ఫెక్షన్‌ సోకగా, దాన్ని అమ్మేశాడు. దూడను మాత్రం తానే పెంచుతున్నాడు. కొద్దిరోజుల క్రితం ఈ దూడ పొదుగు ఉబ్బి ఉండడాన్ని గమనించిన పొరుగింటి మహిళ ఈ విషయాన్ని సజేశ్‌కు చెప్పింది. పరిశీలించి చూడగా.. పల్చటి పాలు వచ్చాయి. దూడకు మంచి మేత వేస్తూ.. కొన్నిరోజుల తర్వాత మరోసారి పాలు పితికి చూశాడు. ఈ సారి చిక్కటి పాలు ఇచ్చింది. గత 15 రోజులుగా రోజుకు రెండు విడతల్లో ఆ దూడ మూడున్నర లీటర్ల పాలు ఇస్తోంది. దూడ ఇస్తున్న పాలలో 8.8శాతం వరకు కొవ్వు ఉంటున్నట్లు వెల్లడైంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)