తమలపాకు - ప్రయోజనాలు

Telugu Lo Computer
0


తమలపాకులని వివాహా, పూజ కార్యక్రమంలో ఉపయోగిస్తూ ఉంటారు. వివాహా కార్యక్రమంలో విందు అనంతరం స్వీట్‌ పాన్‌లను అందిస్తుంటారు. దీనిని నమిలి తింటే శరీరం దృఢంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఆకులను తినడం ద్వారా చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయని వారు చెబుతున్నారు. తమలపాకు లోపల యాంటీ ఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ గుణాలు ఉంటాయి. దీనిని తినడం ద్వారా దగ్గు సమస్యలు తగ్గిపోవడమే కాకుండా, గొంతులో వ్యర్థాలు శుభ్రమవుతాయి. ఈ ఆకును రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యకరంగా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు పొట్టకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయని, తమలపాకును నమలడం వల్ల నోటి దుర్వాసను కూడా తొలగిస్తుందని, నోటిలో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తుందని తెలుపుతున్నారు. అంతేకాకుండా చిగుళ్ళలో నొప్పి లేదా వాపులు ఉంటే దీనిని తినడం ద్వారా తొలగిపోతాయని చిగుళ్లలో మంటను నిరోధించడానికి కృషి చేస్తుందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)