రైతు బజార్లలో తక్కువ ధరకే టమాటాలు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ రైతు బజార్లలో 70 మెట్రిక్ టన్నుల టమాటాను అందుబాటులో ఉంచామని, మార్కెట్ రేట్ కంటే 15 రూపాయలు తక్కువగా రైతు బజార్లలో టమాటాలు అందజేస్తామని  వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు.  విజయవాడ, గుంటూరు, పల్నాడు, ఏలూరు, విశాఖపట్నం రైతు బజారుల్లో టమాటాల కొనుగోలు ప్రజల నుండి భారీ స్పందన కనిపించిందని.. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ధాన్యాన్ని ఆర్బీకేల సాయంతో మిల్లులకు తరలించేందుకు అయ్యే రవాణా, హమాలీ ఖర్చులను కూడా ప్రభుత్వం చెక్కుల రూపంలో రైతులకు అందిస్తోందని వెల్లడించారు కారుమూరి నాగేశ్వరరావు. రైతులకు మేలు చేయడంలో భాగంగా మిల్లర్ల పాత్రను తప్పించి ఆర్బీకేల ద్వారా ధాన్యం సేకరణ చేపట్టాము. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లోకే ఆధార్‌ నంబర్‌ అనుసంధానంతో నగదు జమ అవుతుంది. మిల్లర్ల ప్రమేయానికి ఆస్కారం లేదని పేర్కొన్నారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)