జకార్తా బయల్దేరిన పురుషుల హాకీ టీం

Telugu Lo Computer
0


ఇండోనేషియాలో జరగనున్న ఆసియా కప్ -22 లో పాల్గొనేందుకు భారత పురుషుల హాకీ జట్టు శుక్రవారం జకార్తాకు బయలుదేరింది. ఈ నెల 23 నుంచి ఆసియా కప్ మొదలు కానుంది. ఇండియా, జపాన్, మలేషియా, పాకిస్తాన్, సౌత్ కొరియా, బంగ్లాదేశ్, ఒమన్ దేశాలు ఈ టోర్నీలో ఆడనున్నాయి. పూల్ -ఏ లో ఇండియాతో పాటు పాకిస్తాన్, జపాన్, ఇండోనేషియా, పూల్ -బీ లో సౌత్ కొరియా, మలేషియా, బంగ్లాదేశ్, ఒమన్ జట్లు ఉన్నాయి. కాగా.. టోర్నీ ప్రారంభం రోజునే ఇండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడనుంది. చివరిసారి 2017లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన 10వ ఆసియా కప్ లో భారత్ టైటిల్ కైవసం చేసుకుంది. అలాగే 2022లో బీజింగ్ లో జరిగిన ఒలంపిక్స్ లో కెప్టెన్ బీరేంద్ర లాక్రా నేతృత్వంలోని భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. అదే ఊపులో ఇప్పుడు ఆసియా కప్ సాధించేందుకు భారత జట్టు సిద్ధమైంది. ఈ మేరకు బెంగళూరులో శిక్షణ పూర్తి చేసుకుని జకార్తాకు బయలుదేరింది. ఇప్పటికే భారత్ 3 ఆసియా కప్ టైటిళ్లు సాధించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)