కేంద్రానికి రూ.30 వేల కోట్లు ఆర్‌బీఐ అందజేత ?

Telugu Lo Computer
0


ఈ ఏడాది మిగులుగా భారీ నగదును కేంద్ర ప్రభుత్వానికి ట్రాన్స్‌ఫర్ చేసేందుకు ఆర్‌బీఐ అంగీకరించింది. ఆ నగదు అక్షరాల రూ.30,307 కోట్లు. ఇందులో భాగంగా ఆర్‌బీఐ ఆకస్మిక రిస్క్ బఫర్‌ను 5.50 శాతంగా కొనసాగించాలని నిర్ణయించింది. వీటితో పాటుగా దేశంలో ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి, దేశీయ, ప్రపంచ సవాళ్లు, తాజాగా భౌగౌళిక రాజకీయల్లో జరిగిన అభివృద్ధి ప్రభావాలను బ్యాంక్ పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయానికి వచ్చింది. అయితే 2022కి సంబంధించిన డివిడెండ్‌ను కేంద్రం 2023కి బదిలీ చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఆశించిన దానికంటే ఈ ఏడాది చాలా తక్కువ డివిడెండ్ వచ్చింది. ఆర్థిక సంవత్సరం 2023లో సెంట్రల్ బ్యాంక్, ప్రభుత్వ ఆధ్వర్యంలోని రుణదాతల నుండి డివిడెండ్‌గా రూ. 73.948 కోట్లు పొందవచ్చని కేంద్రం అంచనా వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)