డీవైఎఫ్ఐ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులుగా ఎఎ రహీమ్, హిమగ్నారాజ్ భట్టాచార్య

Telugu Lo Computer
0


అఖిల భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) 11వ అఖిల భారత మహాసభ దిగ్విజయంగా ముగిసింది. చివరి రోజైన ఆదివారం నాడు 77 మంది సభ్యులతో కేంద్ర కమిటీని, 18 మంది ఆఫీస్‌ బేరర్స్‌ను మహాసభ ఎన్నుకుంది. అనంతరం సమావేశమైన డీవైఎఫ్‌ఐ నూతన కేంద్ర కమిటీ అధ్యక్షునిగా ఎఎ రహీమ్‌ను, ప్రధాన కార్యదర్శిగా హిమగ్నారాజ్‌ భట్టాచార్య, కోశాధికారిగా సంజీవ్‌ కుమార్‌ను ఎన్నుకుంది. కేరళకు చెందిన ఎఎ రహీమ్‌ రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హిమాగ్నారాజ్‌ పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు. నూతన నాయకత్వానికి సీపీఐ(ఎం) అభినందనలు తెలిపింది. కేంద్ర కమిటీలో 62 మంది యువకులు కాగా, 15 మంది యువతులు ఉన్నారు. అయితే 77 స్థానాల్లో 17 స్థానాలను తరువాత కోఆప్ట్‌ చేస్తారు. రాష్ట్రస్థాయిలో మహాసభలు నిర్వహించాల్సివున్న రాష్ట్రాలకు వీటిని కేటాయించారు. సంబంధిత రాష్ట్రాలు ఆ స్థానాలను రాష్ట్ర మహాసభల్లో ఎన్నుకుంటారు.


Post a Comment

0Comments

Post a Comment (0)