మరి ఇదేంటి మహాశయా ?

Telugu Lo Computer
0


రాహుల్ వీడియో భాజపా పోస్ట్‌ చేసిన కొద్ది గంటల్లోనే కేంద్ర మాజీ మంత్రి, భాజపా రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్‌ జావదేకర్‌ ఓ పార్టీలో పాల్గొన్న ఫొటోతో కాంగ్రెస్‌ కౌంటర్‌ ఇచ్చింది. ఓ పార్టీలో జావదేకర్‌ షాంపైన్‌ బాటిల్‌ పట్టుకొని వేడుకల్లో ఉన్న ఫొటోను కాంగ్రెస్‌ నేత బీవీ శ్రీనివాస్‌ 'ఎవరో గుర్తుపట్టండి?' అని క్యాప్షన్‌తో పోస్ట్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు రాహుల్‌ విదేశాల్లో నైట్‌క్లబ్‌ల్లో పార్టీ చేసుకుంటున్నారంటూ భాజపా ఐటీ కన్వీనర్‌ అమిత్‌ మాలవీయ ట్విట్‌ చేయగా మిత్ర దేశంలో ఫ్రెండ్‌ పెళ్లికి వెళ్లడం ఏమీ నేరం కాదని కాంగ్రెస్‌ కౌంటర్‌ ఇచ్చింది. ''ప్రధాని మోదీ మాదిరిగా రాహుల్‌ గాంధీ ఏం పాకిస్థాన్‌లోని పిలవని వేడుకకు వెళ్లి నవాజ్‌ షరీఫ్‌తో కేక్‌ కట్‌ చేయలేదు కదా. జర్నలిస్టు ఫ్రెండ్‌ వివాహానికి హాజరయ్యేందుకు మిత్ర దేశమైన నేపాల్‌ వెళ్లారు. ఇందులో తప్పేంటి ? ఇదేం నేరం కాదు. బహుశా స్నేహితులు, కుటుంబసభ్యుల పెళ్లిళ్లకు వెళ్లడాన్ని కూడా నేరంగా భావిస్తూ భాజపా త్వరలోనే నిర్ణయం తీసుకుంటుదేమో'' అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా దుయ్యబట్టారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)