న్యాయాన్ని అపహాస్యం చేయడమే !

Telugu Lo Computer
0


సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నాయకుడు అజాంఖాన్‌ బెయిల్‌ పిటీషన్‌ విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయాన్ని అపహాస్యం చేయడంగా దీనిని విమర్శించింది. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేయడంతో అజాంఖాన్‌ ప్రస్తుతం సీతాపూర్‌ జైలులో ఉన్నారు. జైలులో ఉన్నా రాంపూర్‌ నియోజకవర్గం నుంచి వరసగా పదోసారి అజాంఖాన్‌ గెలిచారు. 'అన్ని కేసుల్లోనూ అజాంఖాన్‌కు బెయిల్‌ వచ్చినా ఒక్క కేసులో ఆయన సుదీర్ఘకాలం జైలులో ఉన్నారు. ఇది న్యాయాన్ని అపహాస్యం చేయడమే' అని ఎల్‌ నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)