బ్రసెల్స్ మొలకలు - ఉపయోగాలు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 7 May 2022

బ్రసెల్స్ మొలకలు - ఉపయోగాలు !


బ్రసెల్స్ మొలకలు మార్కెట్ లో విరివిగానే లభ్యం అవుతున్నాయి. వీటిని ఎక్కువగా వేడి చేయకుండా హాఫ్ బాయిల్ మాత్రమే చేయాలి. ఎక్కువగా వేడి చేస్తే పోషకాలు తగ్గుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండుట వలన మన శరీరం ఎటువంటి వ్యాధులకు గురి కాకుండా కాపాడుతుంది. బ్రసెల్స్ మొలకలు అనేవి డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిది. డయాబెటిస్ నియంత్రణలో ఉండటానికి మరియు భవిష్యత్ లో డయాబెటిస్ రాకుండా ఉండటానికి సహాయపడుతుంది. డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది. శరీరం కణజాలం దెబ్బతినకుండా కాపాడుతుంది. డయాబెటిస్ ఉన్నవారిలో వచ్చే నరాల బలహీనత, నరాల మంటలను తగ్గిస్తుంది. వీటిలో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరిగి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది అలాగే జీర్ణ సమస్యలు లేకుండా చేస్తుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. కెరోటినాయిడ్స్‌ సమృద్దిగా ఉండుట వలన కంటికి సంబందించిన సమస్యలు లేకుండా చేయటమే కాకుండా కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌ సమృద్దిగా ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ లేకుండా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

No comments:

Post a Comment