ప్రధానిగా మోడీ కంటే రాహులే మేలు !

Telugu Lo Computer
0


ఇండో ఏషియన్‌ న్యూస్‌ సర్వీస్‌ అనే సంస్థ జరిపిన సర్వేలో నరేంద్ర మోడీ కంటే రాహుల్ గాంధీకే ప్రధానిగా ఎక్కువ మంది ఓటేసినట్లు తెలిపింది. అయితే ఈ సర్వే మిళనాడులో మాత్రమే జరిగింది. ఈ సంస్థ 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన అసోం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో సర్వే చేసింది. అక్కడి ప్రభుత్వాల పనితీరును ఆరా తీసింది. రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ప్రజా స్పందన తెలుసుకుంటూనే.. ప్రధానమంత్రి విషయంలో సర్వే చేసింది. ఐఏఎన్‌ఎస్‌ తాజాగా వెల్లడించిన సర్వే ఫలితాల్లో తమిళనాడుకు సంబంధించి ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. దేశానికి కాబోయే ప్రధానమంత్రిగా ఎవరు బెటర్ అన్నప్రశ్నకు.. రాహుల్ గాంధీకే ఎక్కువ ప్రజాదరణ కనిపించింది. 54 శాతం మంది తమిళనాడు ప్రజలు రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచారు. మోడీకి 32 శాతం మంది ఓటేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పనితీరుకు తమిళనాడు వాసులు తక్కువ మార్కులే వేశారు. ప్రధానిగా మోడీ పని తీరు బాగుందని 17 శాతం మంది తమిళులు చెప్పగా.. 40 శాతం మంది జనాలు కాస్త బాగుందని తెలిపారు. 40 శాతం మంది ప్రజలు మోడీ పనితీరు బాగా లేదని చెప్పారని ఐఏఎన్‌ఎస్‌ సంస్థ వెల్లడించింది. ఇక సౌత్ ఇండియా ముఖ్యమంత్రులపై నిర్వహించిన సర్వేలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ టాప్ ప్లేస్ లో ఉన్నారు. పాలనలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు స్టాలిన్. ఆయన విధానాలు జాతీయ స్థాయిలోనూ చర్చగా మారాయి. తమిళనాడు ప్రజలు కూడా స్ఠాలిన్ పనితీరుపై సంతోషంగా ఉన్నట్లు తాజా సర్వేలో తేలింది. 2021లో పోల్చితే స్టాలిన్ గ్రాఫ్ మరింత పెరిగిందని ఇండో ఏషియన్‌ న్యూస్‌ సర్వీస్‌ నిర్వాహకులు చెప్పారు. స్టాలిన్ పనితీరుపై ఏకంగా 85 శాతం తమిళ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత భారీ స్థాయిలో జనాల మద్దతు పొందడం చిన్న విషయం కాదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. సీఎంగా స్టాలిన్ కు జైకొడుతున్న తమళి తంబీలు.. ప్రధానిగా మోడీ కంటే రాహుల్ గాంధీ వైపు మొగ్గు చూపడం ఆసక్తిగా మారింది. బీజేపీ పట్ల తమిళనాడు ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు తాజా సర్వే నిదర్శనంగా నిలుస్తుందని చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)