అంబుజా సిమెంట్స్‌ అదాని వశం ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 16 May 2022

అంబుజా సిమెంట్స్‌ అదాని వశం !
స్విట్జర్లాండ్‌కు చెందిన హోల్‌సిమ్ వాటాలను  అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీ కొనుగోలు చేసింది. అంబుజా సిమెంట్స్‌లో హోల్‌సిమ్‌కు 63.19, ఏసీసీలో 4.48 శాతం వాటాలు ఉండేవి. వాటిని గౌతమ్ అదాని 10.5 బిలియన్ డాలర్లతో సొంతం చేసుకుంది. 81,361 కోట్ల రూపాయలను అంబుజా సిమెంట్స్, ఏసీసీల్లో ఇన్వెస్ట్ చేసింది. అలాగే- నాన్ ప్రమోటర్ షేర్ హోల్డర్స్‌గా 26 శాతాన్ని కొనుగోలు చేయడానికి ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చింది. దీనికి సంబంధించిన ఒప్పందాలు ఇదివరకే కుదుర్చుకుంది. దీని ఫలితం- ఇవ్వాళ అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన షేర్లపై సానుకూలంగా పడింది. అవన్నీ రాకెట్లా దూసుకెళ్లాయి. అదాని ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ రేట్లు 2,150 వద్ద ట్రేడ్ అవుతోంది. బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో శుక్రవారం నాటి క్లోజింగ్ ట్రేడింగ్‌తో కంపేర్ చేసి చూస్తే ఇది 4.62 శాతం అధికం. ఇవ్వాళ ప్రారంభంలోనే 2.14 శాతం లాభంతో ఈ షేర్స్ ట్రేడింగ్ ఆరంభమైంది. క్రమంగా పెరుగుతూ వెళ్లింది. అప్పర్ సర్క్యూట్‌లో ట్రేడ్ అయింది. 50 రోజుల తరువాత ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. అదాని ట్రాన్స్‌మిషన్ షేర్ ధర 2,257 వద్ద ట్రేడ్ అవుతోంది. శుక్రవారం 2,215.75 వద్ద దీని ట్రేడింగ్ ముగిసింది. అదాని విల్మార్ స్టాక్స్ ధరలో సైతం కదలిక కనిపించింది. 595 రూపాయల వద్ద ట్రేడింగ్ అయింది. ఇదివరకు అదాని విల్మార్ షేర్ల ధరల్లో అయిదు శాతం క్షీణత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ గ్రూప్ నుంచి ఇప్పటికే ఆరు కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వచ్చాయి. ప్రస్తుతం అవన్నీ చెప్పుకోదగ్గ స్థాయిలో లాభాలను నమోదు చేస్తోన్నాయి. హోల్‌సిమ్ వాటాలను కొనుగోలు చేసిన అనంతరం అదాని గ్రూప్స్ ఓ సరికొత్త రికార్డును నెలకొల్పినట్టయింది. సిమెంట్ ఉత్పాదక రంగంలో దేశంలోనే రెండో అతిపెద్ద ఇండస్ట్రీగా ఆవిర్భవించింది. ప్రస్తుతం అల్ట్రాటెక్ సిమెంట్-111.4 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. ఏసీసీ అండ్ అంబుజా సిమెంట్స్-70 మిలియన్ టన్నులతో రెండో స్థానంలోకి వచ్చింది. శ్రీసిమెంట్-43.4, నువొకొ విస్టాస్ కార్పొరేషన్-22.3, రామ్‌కో సిమెంట్స్-19.4, ఇండియా సిమెంట్స్-15.6, బిర్లా సిమెంట్స్-15.4, జేకే సిమెంట్స్ 13.9, జేకే లక్ష్మీ సిమెంట్స్-13.9, ఓరియంట్ సిమెంట్స్ 8.5 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేస్తున్నాయి. 

No comments:

Post a Comment