చోరీకే ఇది పరాకాష్ట !

Telugu Lo Computer
0

 

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి దొంగతనాలకు సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రతీ చోట సీసీటీవీ కెమెరాలు అందుబాటులోకి రావడంతో దొంగలు ఇట్టే దొరికి పోతున్నారు. తాజాగా సోషల్‌ మీడియాలో ఇలాంటి ఓ దొంగతనం వీడియో వైరల్‌ అవుతోంది. వివరాల్లోకి వెళితే ఓ వృద్ధ మహిళ ఒక షాప్‌ వద్ద నిల్చొని ఉంది. షాపు యజమానితో ఏదో వస్తువు గురించి మాట్లాడుతోంది. అంతలోనే అక్కడికి మరో వృద్ధ మహిళ వచ్చింది. వచ్చి రాగానే అప్పటికే అక్కడ ఉన్న మహిళ బ్యాగ్‌పై కన్నేసింది. గందరగోళానికి గురి చేసి సదరు మహిళ బ్యాగు జిప్‌ను తెరిచింది. తర్వాత షాప్‌ యజమానితో మాట్లాడుతూ బ్యాగ్‌లో ఉన్న మొబైల్‌ ఫోన్‌ను కొట్టేసి ఎంచక్కా బ్యాగులో వేసుకొని అక్కడి నుంచి తుర్రుమని వెళ్లిపోయింది. ఇదంతా అక్కడే ఉన్న ఓ సీసీ టీవీ కెమెరాలో రికార్డ్‌ కావడంతో ఆ మహిళ చేతి వాటం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. సదరు మహిళ చోర కళను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)