ఈ రైలు మార్గం ఇప్పటికీ బ్రిటిష్ ఆధీనంలోనే ఉంది!

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని అమరావతిలో ఈ రైల్వే స్టేషన్ఉంది. శకుంతల ఎక్స్‌ప్రెస్ ఈ మార్గంలో నడుస్తుంది. కాబట్టి దీనిని శకుంతల రైల్వే స్టేషన్ అని కూడా పిలుస్తారు. 1903లో బ్రిటిష్ కంపెనీ క్లిక్ నిక్సన్ తరపున ట్రాకింగ్ పని ప్రారంభించారు. ఈ రైల్వే లైన్ 1916లో పూర్తయింది. ఈ కంపెనీ నేడు సెంట్రల్ ప్రావిన్స్ రైల్వే కంపెనీగా పిలుస్తున్నారు. ముంబయిలోని నౌకాశ్రయానికి పత్తిని రవాణా చేయడానికి బ్రిటిష్ వారు ఈ రైలు మార్గాన్ని నిర్మించారు. అమరావతి ప్రాంతంలో పండిన పత్తికి దేశవ్యాప్తంగా విపరీతమైన గిరాకీ ఉంది. దీంతో ముంబయి నౌకాశ్రయానికి పత్తిని రవాణా చేయడానికి బ్రిటిష్ వారు ఈ రైల్వే లైన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతే కాకుండా ఈ రైలు మార్గ విస్తరణ కోసం ప్రైవేట్ కంపెనీలు మాత్రమే పనిచేస్తుండడం విశేషం. శకుంతల రైల్వే మార్గం ఇప్పటికి బ్రిటిష్ కంపెనీ ఆధీనంలోనే ఉంది. అయితే ఈ ట్రాక్ నిర్వహణ బాధ్యత కూడా ఆ సంస్థపైనే ఉంది. కానీ, గత 60 ఏళ్లుగా ఈ ట్రాక్ కు ఎలాంటి మరమ్మతులు జరగలేదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ ట్రాక్ పై లోకో ఇంజన్స్ గరిష్టంగా 20 కి.మీ. వేగంతో వెళ్తున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)