మాతృభాషలోనే ప్రాథమిక విద్య ఉండాలి

Telugu Lo Computer
0


ఢిల్లీ యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ పిల్లల ప్రాథమిక విద్య తప్పనిసరిగా మాతృభాషలో ఉండాలని అన్నారు.  భారతీయ విద్యా వ్యవస్థ కూడా ''మన సంస్కృతి''పై దృష్టి సారించాలని అన్నారు. ''పిల్లలకు మాతృభాషలో ప్రాథమిక విద్యను అందిస్తే వారు దానిని గ్రహించగలుగుతారు. వేరే భాషలో ఇస్తే ముందుగా ఆ భాష నేర్చుకోవాలి, ఆ తర్వాత అర్థమవుతుంది'' అన్నారు. పిల్లలు ముందుగా మాతృ భాషను నేర్చుకోవాలని, తర్వాత ఇతర భాషలు నేర్చుకోవాలని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ఛాన్సలర్‌గా ఉన్న ఉపరాష్ట్రపతి నాయుడు, గౌరవ అతిథిగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యారు. కోర్టులలో స్థానిక భాష వాడకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలను కూడా వెంకయ్యనాయుడు ప్రస్తావించారు. నిన్న ప్రధాని మోదీ కూడా కోర్టుల్లో స్థానిక భాషల ఆవశ్యకత గురించి మాట్లాడారు. కోర్టులు మాత్రమే ఎందుకు, ప్రతిచోటా అమలు చేయాలి అని అన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)